స్థల నిర్ణయము భూదానము:

శ్రీ శ్రీ శ్రీ మదనానంద సరస్వతీ స్వాములవారు ఆలయ నిర్మానమునకై స్థలాన్వేషణ ప్రారంభించిరి. ఉదారహృదయులు తడకమడ్ల వంశజులు వారి స్వంత భూమిని ఆలయ నిర్మాణమునకు ఒసంగుటకు ముందుకు వచ్చిరి. స్వామి ఆ స్థలము ఆలయ నిర్మాణమునకు యోగ్యమైనదా ? కాదా ? అని పరీక్షించుటకు తాను స్వయంగా చిన్న కుటీరమేర్పరచుకొని నిద్రించారు.

స్వప్నములో మళ్ళీ వైష్ణవ స్వాములు కనిపించి ఆలయ నిర్మాణ కార్యక్రమము చేపట్టవలసినదిగా ఆదేశించారు. సరిగ్గా అదే సమయంలో శ్రీ తడకమడ్ల వీరయ్య గారి ధర్మపత్ని శ్రీమతి రంగమ్మ గారికి కూడా వైష్ణవ స్వాములు స్వప్నములో సాక్షాత్కరించి ఆలయ నిర్మాణమునకు స్థల దానము చేయుటకు సూచించిరి.

తెల్లవారగానే స్వామి వారు ఈ వార్త తడకమడ్ల వంశజులకు చేరవేసినారు. తమ తల్లి గారి స్వప్నము, స్వామి వారి వార్త శ్రీ మల్లయ్య, శ్రీ రంగయ్య, శ్రీ కోటయ్య, శ్రీ లింగయ్య మరియు శ్రీ రాజేశం గారలను పరమానంద భరితులను చేసింది. మాతృదేవి కల, స్వామి వారు వర్తమానం పంపుట వారు మహా ప్రసాదంగా భావించి మనోవాక్కాయ పవిత్రతతో అంగీకరించారు.

తడకమడ్ల వారి సేవలు:

మాతృమూర్తి ఆజ్ఞానుసారము ఈ మహత్తర పవిత్ర కార్యమును బృహత్కార్యముగా భావించి ఆలయ నిర్మాణమునకు 4 ఎకరముల 29 గుంటల భూమిని తల్లి చేతుల మీదుగా భూదానముగావించిరి. ఈ విధంగా సిద్దిపేటలో శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠకు తడకమడ్ల వంశజులు అంకురార్పణ గావించిరి. ఇట్టి స్థలమును దేవాలయము, ఆశ్రమము, వేద పాటశాల, అన్నసత్రము, వైద్యాలయము, గ్రంధాలయము వినియోగామునకై భూదానము గావించిరి. అంతే కాదు ఆశ్రమ నిర్మాణము పూర్తిగా మరియు ఆలయ నిర్మాణము కొంత మేరకు పూర్తి చేసిరి. వ్యవస్థాపకులు తడకమడ్ల మల్లయ్య, రంగయ్య, కోటయ్య, లింగయ్య మరియు రాజేశం గారల పేరు మీద 5 వసతి గృహములు నిర్మించిరి. మరియు వారి తల్లిదండ్రులు కీ.శే. వీరయ్య, రంగమ్మ గారల పేరున వసతి గృహము నిర్మించిరి. తడకమడ్ల రంగయ్య వ్యవస్థాపక అధ్యక్షులు 'మహాద్వారము' మెదక్ రోడ్డుకు నిర్మించిరి. కీ. శే. తడకమడ్ల మల్లయ్య, లక్ష్మి గారల పేరున శివస్థూపము మరియు భోజనశాల వారి కుమారుడు ఈశ్వరయ్య గారు నిర్మించిరి.

విజ్ఞప్తి

దాతలు విరాళములు పంపదలచినవారు డ్రాప్టులు లేదా చెక్కులు:
"శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రము, సిద్ధిపేట" పేరున పంపగలరు
ఆంధ్ర బ్యాంకు అకౌంట్ నెంబర్ :52410011008018
ఐ. ఎఫ్. ఎస్. సి. కోడ్ :
ఐ. ఎఫ్. ఎస్, ఆర్.టి.జి.ఎస్. కోడ్: ఎ.ఎన్.డి.బి.0000524