ఆలయ ప్రతిష్ఠ:

తడకమడ్ల వంశజులు దానము గావించిన స్థలములో స్వామి ఒక కుటీరమును నిర్మించుకొని ఆలయ నిర్మాణ పర్యవేక్షణ గావించిరి. ఆలయ నిర్మాణము వేగముగా సాగుచుండెను. సిద్దార్ది నామ సం. జ్యేష్ఠ శు. పాడ్యమి (26-5-1979) నుండి జ్యేష్ఠ శు. పంచమి (30-5-1979) వరకు ప్రతిష్ఠా కార్యక్రమము జరిగినది. గర్భాలయములో మట్టితో చేయబడిన కోటిపైన లింగములను, కోట్లాది శివపంచాక్షరి వ్రాత ప్రతులను మరియు తిలాక్షితలు లింగము అడుగు భూమిలో ప్రతిష్ఠించబడినవి. వాటిపై వారణాసి నుండి తేబడిన లింగము ప్రతిష్టించబడినది. గర్భాలయములో శివ పంచాయతనము, మహాగణపతి, నందీశ్వరుడు, ద్వారపాలకులు, రాజరాజేశ్వరీదేవి, గాయత్రిమాత, దత్తాత్రేయ మరియు ఆదిశంకరాచార్య విగ్రహములు ప్రతిష్టించబడినవి. ఇట్టి కార్యక్రమములో ఎందరో మహనీయులు పాల్గొనిరి. అఖండ అన్నదానము జరిగినది. హరికథలు, బుర్రకథలు, భజనలు, విశేషంగా జరిగినవి. వైదిక కార్యక్రమములు బ్ర. శ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్దాంతి మరియు శ్రీ ఘట్టేపల్లి శరభారాధ్యుల ద్వారా అనేక వేద బ్రాహ్మణోత్తములచే వైభవంగా జరిగినవి. తేది. 30-5-1979 సిద్దార్ది నామ సం.ర జ్యేష్ఠ శు. పంచమి రోజున శ్రీశ్రీశ్రీ మదనానంద సరస్వతీ స్వాముల పవిత్ర కరకమలములచే యంత్ర విగ్రహ ప్రతిష్ఠలు జరిగినవి. కొన్ని లక్షల రూపాయల వ్యయముతో సిద్ధిపేట మరియు చుట్టు ప్రక్కల గ్రామస్థుల సహాయ సహకారములతో ఆలయ నిర్మాణము గావించబడినది. పార్థివ కోటి లింగములకు వణిజకుల శ్రేష్ఠులు తడకమడ్లవారే మృత్తికను సమకూర్చారు.

భవిష్యత్తులో ఆలయములో నిర్మించదలచిన కట్టడములు:

1. కళ్యాణ మండపము
2. వృద్దాశ్రమము
3. గోశాల
4. ఆధ్యాత్మిక గ్రంధాలయము
5. అనాదాశ్రమము
6. సత్రములు

ప్రస్తుత అవసరములు:

1. దేవాలయములకు రంగులు
2. క్యూ లైను
3. ధర్మ గల్లాలు (హుండీలు)
4. కంప్యూటర్
5. స్నానపు గదులు, మరుగుదొడ్లు

పైన తెలుపబడిన నిర్మాణముల కొరకు ఆసక్తి కలిగిన వారు విరాళములు ఇవ్వదలచిన దాతలు ఈ కింద చెప్పబడిన బ్యాంకు వివరములు గమనించవలసినదిగా మనవి

డిమాండ్ డ్రాప్టులు లేదా చెక్కులు:
"శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రము, సిద్ధిపేట" పేరున పంపగలరు
ఆంధ్ర బ్యాంకు అకౌంట్ నెంబర్ :52410011008018
ఐ. ఎఫ్. ఎస్. సి. కోడ్ :
ఐ. ఎఫ్. ఎస్, ఆర్.టి.జి.ఎస్. కోడ్: ఎ.ఎన్.డి.బి.0000524

శ్రీ సదనందాశ్రమము:

శ్రీశ్రీశ్రీ మదనానంద స్వామి వారు నివసించిన కుటీరమే శ్రీ సదానందాశ్రమము. ఇందు యతులకు, అన్యగ్రామస్తులైన భక్త బృందమునకు, స్వామి భక్తులకు వ్యవస్థ కల్పించబడుచున్నది.

"ప్రజోత్పత్తి" నామ సంవత్సరమున శ్రీ సదానందాశ్రమమునందు శ్రీ స్వామి వారికీ "గాది" ఏర్పాటు చేయబడినది. తర్వాత ఈ స్వామి వారు కర్ణాటక రాష్ట్రంలోని బసవకల్యాణం నందు సదానంద మటం నకు ౬౮వ పీటాదిపతులై భాసిల్లినారు.

ఇంతటి మహత్తరమైన బృహత్కార్యమును చేపట్టి విజయవంతము గావించిన శ్రీశ్రీశ్రీ మదనానంద స్వామివారు విక్రమనామ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి ఆదివారమున సరియగు తేది: 11-11-2000 రోజున శివసాయిజ్యమందిరి. స్ఫటిక శ్రీచక్రం లింగములకు నిత్య పూజలు జరుగుచున్నవి. సదానంద వైదిక పాటశాల నిర్వహించబడుచున్నది.

నాగ దేవత

తేది: 17-5-1979 ఈ ఆలయములో ఒక పరమాద్బుతమైన నాగేంద్రుడు పార్థివ లింగముల సంచిపై ఉదయము 6-30 గం.లకు ప్రత్యక్షమై నాలుగు గంటల పాటు వేలాది మంది పురజనులకు దర్శనమిచ్చి పూజలందుకొనేను. ఇది ఈ క్షేత్ర మహిమకు గొప్ప తార్కాణము. ఈ ఆలయములోని కోటి లింగేశ్వర మహాలింగము వారణాసి (కాశి) నుండి తేబడిన నర్మదా బాణము. ఈ లింగముపై స్వయంభువులైన చంద్రరేఖ, భస్మరేఖలు, పార్వతి, గంగాదేవి మొదలైన చిహ్నములు గలవు.

ఆలయ ప్రాంగణమందలి దేవాలయములు:

ఈ క్షేత్రమందు 12 ఆలయములు 148 విగ్రహములు ప్రతిష్ఠించబడినవి. 36 స్తంభములతో కూడిన సువిశాల ముఖమంటపం ఆలయానికి ఒక ప్రత్యేక ఆకర్షణ.

1. శ్రీ ఉమపార్ధివ కోటి లింగేశ్వర స్వామి,
పంచాయతనం,
శ్రీ మహాగణపతి,
శ్రీ నందికేశ్వరుడు,
ద్వార పాలకులు,
(గర్భాలయ) విగ్రహములు తొమ్మిది,
2. శ్రీ రాజరాజేశ్వరీ దేవి.
3. శ్రీ గాయత్రీ దేవి.
4. శ్రీ దత్తాత్రేయ స్వామి
5. శ్రీ ఆది శంకరులు
6. శ్రీ తులసీమాత,
కామధేనువు,
గోమాత,
7. శ్రీ మురళీ కృష్ణాలయము
8. శ్రీ ఆంజనేయ స్వామి
9. నవగ్రహములు
10. శ్రీ సంతోషిమాత,
శ్రీ సుబ్రమన్యేశ్వర స్వామి,
శ్రీ నాగ దేవత
11. చండీశ్వరాలయము
12. శ్రీ ఉమా మహేశ్వర సహిత అష్టోత్తర శత లింగేశ్వరాలయము
13. శ్రీ పశుపతి నాథ్
14. శ్రీ సాయి బాబా
15. సర్ మదనానంద స్వామి.
16. శ్రీ శివ స్థూపము.

ఇంతే కాకుండా 16 స్తంభములతో కూడిన యాగశాల, అధునాతన సౌకర్యములతో కూడిన పుష్కరిణి, గోశాల, గ్రంథాలయము, కళ్యాణ మండపము, గాలి గోపురము నిర్మింపబడినవి.

ఇటీవలి కాలములో శ్రీ ఉమామహేశ్వర అష్టోత్తర శతలింగ మహా దేవాలయము నిర్మించబడినది. తేది : 1-12 -1996 నుండి 5-12-1996 వరకు ఈ ఆలయంలో 108 లింగముల ప్రతిష్ఠ జరిగినది. ఇందు 108 లింగాములకు 108 మంది దంపతులు ఒకేసారి అభిషేకము చేయుటకు ఏర్పాటు జరిగినది. ఈ ఆలయము మధ్య పెద్ద ఉమామహేశ్వరుల విగ్రహములున్నవి.

రిజిస్టరు సంస్థ:

శ్రీశ్రీశ్రీ మదనానంద సరస్వతీ స్వాముల వారి ఆదేశానుసారము "శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రము" అణు రిజిస్టరు సంస్థ. ది: 9-12-1977 న ఏర్పడినది. రిజిష్టర్డ్ నం. 115/1978 గా సొసైటీ చట్టము 1950 ఎఫ్ క్రింద రిజిష్టర్ కాబడినది. ఆదాయపు పన్ను చట్టము సెక్షన్ 80 జి, 12 ఎ, క్రింద రిజిష్టరు చేయబడినది. మరియు దేవాదాయ శాఖ చట్టం క్రింద రిజిష్టరు చేయబడినది.

ఆకాంక్ష:

సర్వజన శ్రేయస్సుకై సర్వదేవతారాధన, దీన జన సేవా కేంద్రంగా రూపొందించుట, సమాజములో ఆధ్యాత్మిక, ధార్మిక, సేవాభావములను పెంపొందించుట, ఆలయములు, ఆశ్రమం, విద్యాలయం, వైద్యాలయం మరియు అన్నదానములను నిర్వహించుట, వానప్రస్థాశ్రము ఏర్పాటు చేయుట, యతీశ్వరులకు వసతి ఏర్పరచుట.

ఆలయ ప్రాంగణమందలి దేవాలయములు: