శ్రీ శ్రీ శ్రీ మదనానంద స్వాముల వారు:

శ్రీ శ్రీ శ్రీ మదనానంద స్వామి పూర్వాశ్రమ నామం లక్ష్మీనారాయణ. వీరి తల్లిదండ్రులు నరసమ్మ, రావికోటి నరహరిలు. వీరిది శ్రేతి కౌండిన్యస గోత్రము. మెదక్ జిల్లా ఆందోల్ తాలూకాలోని టేకుమాల్ గ్రామము వీరి జన్మ స్థలము. శోభకృతు నామ సం. శ్రావణ శుద్ధ దశమి(1902) రోజున జన్మించిరి.

స్వామి వారు బాల్యము నుండి వైరాగ్య భావము కలిగియుండిరి. నిరంతరం అన్నదానం చేయుచుండెడివారు. బసవ కల్యాణి లోని శ్రీ సదనందాశ్రమ పీఠాదిపతులైన శ్రీ మాధవానంద స్వామి వారి చేత పరీభావి నామ సంవత్సరంలో వైశాఖ మాసమందు వీరు తురీయాశ్రమం స్వీకరించారు.

కొప్పోల్ సంగామేశ్వరాలయంలో వీరు అనేక దేవతా విగ్రహములు ప్రతిష్టించిరి. కోటి పార్తివలింగ దేవాలయం కూడా ఏర్పాటు చేయవలెనని వైష్ణవముర్తులు వీరికి స్వప్నము నందాదేశించిరి.

గమనిక: లింగ ప్రతిష్టాపనా ఇప్పుడు లేవు.

శివ పురాణముననుసరించి కలియుగంలో పార్థివ పూజ శ్రేష్టమైనది. కోటి లింగార్చన శివసాయుజ్యకారకము.

"కృతే మణి మయ లింగం
త్రేతాయాం హేమ సంయుతం
ద్వాపరే పారదం శ్రేష్ఠం
కలౌ పార్థివ పూజనం " (శివ పురాణం)

యుగ ప్రాతిపదికగా కలియుగమున రత్నలింగము, త్రేతాయుగమున బంగారు లింగం, ద్వాపరయుగమున రసలింగము. కలియుగమున పర్తివమనగా మట్టి లింగమునకు పూజ చేయుట విశేష ఫలము. సంఖ్యాపరంగా ఫలితాలను చెప్పబడింది. కోటి లింగములు పూజించిన వారికి అనంత ఫలములని చెప్పబడినది. అందువలన స్వామి కోటి లింగేశ్వరాలయ ప్రతిష్ఠకు యోగ్యమైన స్థలము కొరకు అన్వేషణ ప్రారంభించుచు తమ శిష్య బృందమును సంప్రదించగా వారు వారివారి గ్రామాలను సూచించారు. కాని స్వామికి సంతృప్తి కలుగలేదు. అదే సమయమందు సిద్ధిపేట నుండి ఒక భక్తుడు యాదృచ్చికంగా కొప్పోల్ గ్రామమునకు వెళ్లి స్వామిని దర్శించుకొన్నారు. ఆ సమయమందే స్వామికి అనుకోకుండా అకస్మాత్తుగా ఒక ఆలోచన స్ఫురించినది. ఏ గ్రామములో ఆ దేవాలయము కావలెనో భక్తులు ఆ గ్రామము పేరు వ్రాసి చీటీని సంగమేశ్వర స్వామి వద్ద ఉంచుమనిరి. వ్రాసిన చీటీల నుండి ఒక చీటీని తీయమని ఒక భక్తున్ని ఆదేశించిరి. భగవత్ సంకల్పము మేరకు సిద్ధిపేట అని వ్రాసిన చీటీ వచ్చినది. స్వామికి అంతా అగమ్యగోచరమని అనిపించింది. తనకు ఎలాంటి పరిచయం లేని గ్రామము మరియు తన శిష్యబృందము కూడా లేని గ్రామములో ఏ విధంగా పార్థివ కోటి లింగాలయము నెలకొల్పాలో బోధపడలేదు. కొప్పోల్ సంగమేశ్వర స్వామి ఆదేశానుసాము సంచారము చేయుచు రాక్షస నామ సంవత్సర జ్యేష్ఠ మాసము నందు సిద్దిపేటకు చేరుకొని శ్రీ శరభేశ్వరాలయమందు బసచేసిరి. అచట భక్తులచే పార్థివ లింగములు చేయించిరి