శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రము - సిద్ధిపేట, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రము.

మన భారతదేశమొక పుణ్య భూమి. ఎందరో ఋషులు, మునులు, సాధువులు, సత్పురుషులు, వేదాంతులు, మహా భక్తులు జన్మించిన పవిత్ర భూమి. ఇచ్చట వేదాలు వెలసినవి. ఆశ్రమాలు అవతరించినవి. ఇక్కడి నేల, గాలి , నీరు, నిప్పు, చెట్లు, చేమలు, అతి పవిత్రమైనవిగా భారతీయులు భావిస్తారు. మానవాళిని తరింపజేయుటకు ఎన్నో దేవాలయాలు నిర్మింపబడినవి. మరెన్నో దేవాలయముల నిర్మాణాలు కొనసాగుతున్నవి.

గమనిక: లింగ ప్రతిష్టాపనా ఇప్పుడు లేవు.

తెలంగాణా లోని మెదక్ జిల్లా, సిద్ధిపేట లో శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర క్షేత్రము ఆవిర్భవించినది. ఈ క్షేత్రము సిద్ధిపేట నుండి మెదక్ రోడ్డు మార్గములో బస్సు స్టాండ్ నకు రెండున్నర కిలోమీటర్ల దూరములో నున్నది.

ఈ క్షేత్ర నిర్మాణమునకు శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు మదనానంద స్వామి సంకల్పించగా దానిని అన్ని విధముల సర్వతో ముఖాభివృద్ది చేయుచున్న వారు కీ.శే. తడకమడ్ల వీరయ్య ధర్మపత్ని రంగమ్మ గార్ల కుమారులైన శ్రీయుతులు మల్లయ్య, రంగయ్య, కోటయ్య, లింగయ్య, మరియు రాజేశం గార్లు అను నిత్యం నిరంతర కృషి చేస్తున్నారు.

శ్రీ శ్రీ శ్రీ మదనానంద స్వాముల వారు:

శ్రీ శ్రీ శ్రీ మదనానంద స్వామి పూర్వాశ్రమ నామం లక్ష్మీనారాయణ. వీరి తల్లిదండ్రులు నరసమ్మ, రావికోటి నరహరిలు. వీరిది శ్రేతి కౌండిన్యస గోత్రము. మెదక్ జిల్లా ఆందోల్ తాలూకాలోని టేకుమాల్ గ్రామము వీరి జన్మ స్థలము. శోభకృతు నామ సం. శ్రావణ శుద్ధ దశమి(1902) రోజున జన్మించిరి. మరిన్ని...

దృశ్యాలు