ఉత్సవములు:

ప్రతి సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి మొదలు పంచమి వరకు ఐదు రోజులు వార్షికోత్సవ వేడుకలు జరుగును. ఇందు చండీహవనము, రుద్ర హవనము, మహన్యాస పూర్వ అభిషేకములు, కుంకుమార్చనలు, మహాలింగాభిషేకము, ఘటాభిషేకము, ధార్మిక ఉపన్యాసములు, హరికథలు, అన్నదాన కార్యక్రమములు, విధిగా జరుపబడును. కళ్యాణోత్సవము, రధోత్సవములు, పంచమి రోజున అతి వైభవముగా జరుగును. మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా ఐదు రోజుల వైదిక కార్యక్రమాల నిర్వహణ జరుగుచున్నది.

ఆయా పర్వదినములననుసరించి దేవీ నవరాత్రులు, శ్రీ కృష్ణాష్టమి, నాగుల చవితి, తులసీ కళ్యాణము, సుబ్రహ్మణ్య షష్టి, దత్తాత్రేయ జయంతి, హనుమజ్జయంతి, గణేశ్ నవరాత్రులు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుపబడును.

ప్రతి శుక్రవారము సర్ సంతోషిమాత ఉద్యాపనములు జరుగును. ప్రతి నిత్యము కళ్యానోత్సవము అన్నపూజలు జరుపబడుచున్నవి.

ప్రతిష్ఠా రజతోత్సవములు: (1979 - 2004)

25వ వార్షిక బ్రహ్మోత్సవములు తేది: 14-5-2004 నుండి 24-5-2004 వరకు రజతోత్సవము సందర్భమున సంవత్సరము మొత్తము విశేష కార్యక్రమాలు, మహన్యాస పూర్వక శతరుద్రము, రుద్ర హవనం, చండీహవనం ప్రతి మాసము మరియు విశేష అభిషేకములు, కుంకుమార్చనలు నిర్వహించబడినవి. 25వ వార్షిక బ్రహ్మోత్సవములో 1. శివస్థూపము. 'ఓం నమశ్శివాయ' అసంఖ్యాక వ్రాతప్రతులు స్థూపము నందు ఉంచబడినవి. 2. పంచాముఖేశ్వరుడు (పశుపతినాథ్), 3. మదనానంద స్వామి విగ్రహము మరియు 4. సాయిబాబా విగ్రహములు ప్రతిష్ఠించబడినవి. భాగవత సప్తాహము, హరికథలు, భజనలు నిర్వహించ బడినవి. సిద్ధిపేట ప్రాంతములో గల ఆలయముల వ్యవస్థాపకులు, నిర్వాహకులకు సన్మానం జరిగినది. ఇట్టి కార్యక్రమములు బ్ర. శ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్దాంతి మరియు శ్రీ ఘట్టేపల్లి శరభారాధ్యుల పర్యవేక్షణలో నిర్వహించబడినది.

సదానంద వైదిక పాటశాల:

శ్రీ మదనానంద స్వామి వారి ఆదేశం మేరకు ప్రస్తుతం ఈ ఆశ్రమములో వేద పాటశాల ప్రారంభించబడి ఆలయ ప్రాంగణం వేద ఘోషతో ప్రతిధ్వనించుచున్నది

క్షేత్ర నిర్మాణంలో విశేష సేవలందించిన సేవా తత్పరులు:

1. క్షేత్ర వాస్తు పథకము:
బ్ర. శ్రీ. పాలకుర్తి నృసింహరామ సిద్దాంతి గారు, కొడకండ్ల, నల్గొండ జిల్లా.

2. విగ్రహములు:
శ్రీ శేకళ్ళ వెంకటాచలం గారు, శ్రీ రామశిల్ప కళామందిర్, రామడుగు, కరీంనగర్ జిల్లా.

3. శిఖర నిర్మాణములు:
శ్రీ అణుపర్తి అబ్బాయి, శ్రీ తాతబ్బాయి బృందము, సంపర, తూర్పు గోదావరి జిల్లా.

4. ఆభరణముల తయారీ:
శ్రీ కే. బాలరత్నం గారు, సిద్ధిపేట.

ఈ క్షేత్రమును దర్శించిన మహనీయులు:

1. శ్రీశ్రీశ్రీ మాధవానంద స్వామి వారు, బసవ కళ్యాణ్, కర్నాటక.
2. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ పెదజియ్యర్ మరియు చినజియ్యర్ స్వాములు,
3. శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ నృసింహ భారతీ స్వామి, హంపీ పీటం, కర్ణాటక.
4. శ్రీ విద్యా ప్రకాశ నందగిరి స్వామి, శ్రీకాళహస్తి
5. శ్రీ సుందర చైతన్యానంద స్వామి, ధవళేశ్వరం, తూ.గో. జిల్లా.
6. శ్రీ పుండరీకాక్ష చంద్రశేఖర సరస్వతీ స్వామి, నేల పోగుల, వరంగల్ జిల్లా.
7. శ్రీ నరసింహ స్వామి, మర్రిముచ్చాల.
8. శ్రీ మహాత్మా పాలకుర్తి వెంకట నారాయణ గారు, పాలకుర్తి.
9. బ్ర. శ్రీ. మాణిక్య దీక్షితులు, బీదర్.
10. శ్రీ విశ్వనాథ్ శాస్త్రి, శివ్వంపేట.
11. శ్రీ కేరళ సుబ్రమణ్య శాస్త్రి,
12. డా. శంకర్ దయాళ్ శర్మ గారు, గవర్నర్, ఆం. ప్ర.
13. శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు, ఎడిటర్, ఆంధ్రప్రభ.
14. మాన్యులు శ్రీ పి. వి. నరసింహరావు గారు,
15. శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతీ స్వామి వారు, పుష్పగిరి పీటం.
16. శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి వారు, శృంగేరి పీటం.
17. శ్రీశ్రీశ్రీ స్వామి సర్వేశ్వరానంద గారు, కళ్యాణాశ్రమము, చెన్నై.
18. శ్రీశ్రీశ్రీ మాటా శివ చైతన్య గారు.
19. శ్రీశ్రీశ్రీ దయానందగిరి స్వామి వారు, గాగిళ్ళాపురం.
20. శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి, కంచి పీటాదిపతులు.
21. శ్రీ సిద్దేశ్వరానంద స్వామి, కుర్తాలం పీటాధిపతి.
22. శ్రీ కృష్ణానంద సరస్వతి, శ్రీ మదనానంద స్వామి సరస్వతీ పీటం, రాంపురం, తొగుట.
23. శ్రీ మాధవానంద సరస్వతి, శ్రీ మదనానంద స్వామి సరస్వతీ పీటం, రాంపురం, తొగుట.
24. శ్రీ కపిల్ స్వామి, వారణాసి.
25. శ్రీ శ్రీధర స్వామి, ముక్కామల.